27.8.25

భక్తలోకానికి టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు వినాయక చవితి శుభాకాంక్షలు ttd chairman




శ్రీ విఘ్నేశ్వరుని చల్లని దీవెనలతో ప్రతి ఇంటా ఆరోగ్యం, శాంతి నెలకొని సుఖసంతోషాలతో జీవించాలనే ఆకాంక్షతో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు మంగళవారం భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

భక్తులు చేపట్టే శుభకార్యాలన్నింటికీ విఘ్నాలు తొలగి విజయాలు చేకూరాలని ఆయన ప్రార్థించారు.
ఈ సందర్భంగా టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీ జి. భానుప్రకాశ్ రెడ్డి, శ్రీమతి పనబాక లక్ష్మి, అలాగే టిటిడి ఎక్స్ అఫిషియో మెంబర్ శ్రీ దివాకర్ రెడ్డి గార్లు కూడా భక్తలోకానికి వినాయక చవితి శుభాకాంక్షలు అందించారు.

No comments :
Write comments