7.8.25

ఎస్పీడబ్ల్యూ మహిళా జూనియర్ కళాశాలను పరిశీలించిన టిటిడి ఛైర్మెన్ విద్యార్థినుల హాస్టల్ సౌకర్యాల పెంపుకు ఆదేశం TTD Chairman











ఎస్పీడబ్ల్యూ మహిళా జూనియర్ కళాశాలలో అత్యవసరమైన పనులను సకాలంలో పూర్తి చేయాలని టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు ఆదేశించారు. మహిళా జూనియర్ కళాశాల  జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, టిటిడి బోర్డు మెంబర్ శ్రీ జి. భానుప్రకాష్ రెడ్డి కలిసి బుధవారం ఆయన పరిశీలించారు.


ఈ సందర్భంగా టిటిడి ఛైర్మెన్ మాట్లాడుతూ, మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థినుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని, విద్యార్థినులు ప్రాథమిక అవసరాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.  కళాశాలలోని సమస్యలను టిటిడి జేఈవో, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్  తన దృష్టికి తీసుకువచ్చారని, వాటి అన్నింటిపై నివేదిక తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యార్థినులు చదువుకునేందుకు కళాశాల పరిసరాలు చాలా బాగున్నాయన్నారు. అదేవిధంగా ఈ కళాశాలలో ఉత్తీర్ణత శాతం చాలా అద్భుతంగా ఉందని అభినందించారు. 

ముఖ్యంగా కళాశాలలో విద్యార్థినులకు  హాస్టల్ సామర్థ్యాన్ని, వసతి సౌకర్యాన్ని పెంచాలని, వైద్య సౌకర్యాల పెంపు, వేడి నీటి కోసం సోలార్ వాటర్ హీటర్స్, ఈ - లెర్నింగ్ సెమినార్ హాల్ ఏర్పాటు, హాస్టల్ లో మరమ్మతులు, ఫిజికల్ ఎడ్యూకేషన్ సౌకర్యం తదితర అంశాలపై అధికారులు నివేదిక తయారు చేసి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు టిటిడి ఛైర్మెన్ సూచించారు.

అంతకుముందు టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు అధికారులతో కలిసి కాలేజీ పరిసరాలను, వంట గది, హాస్టల్ ప్రాంతాలను తనిఖీ చేశారు. అటు తరువాత విద్యార్థినులు, తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు

ఈ కార్యక్రమంలో టిటిడి డిఈవో శ్రీ వెంకట సునీల్, ప్రిన్సిపాల్ డా. సి. భువనేశ్వరి, ఎస్.ఈ శ్రీ మనోహరం తదితరం అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments