26.8.25

తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీ వరాహస్వామి జయంతి varahaswamy vari jayanti




ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది.


ఇందులో భాగంగా ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేప‌ట్టారు. అనంత‌రం వేద‌మంత్రాల న‌డుమ మూల‌వ‌ర్ల‌కు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments