6.8.25

కార్వేటి న‌గ‌రంలో తొలిసారిగా శ్రీ వ‌ర‌మ‌హాల‌క్ష్మీ వ్ర‌తం Varalakshmi vratam




కార్వేటినగరం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో కొలువైయున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధానంలో వరమహాలక్ష్మీ వ్రతాన్ని తొలిసారిగా ఈ ఏడాది ఆగ‌స్టు 8వ తేదిన ఉద‌యం 10 గంటల  నుండి 12 గంటల వరకు అంగ‌రంగ‌వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు.


ఈ ప‌ర్వ‌దినాన శ్రీ వరమహాలక్ష్మీ  వ్రతంలో  పాల్గొనదలచిన భక్తులు (ఇద్దరికి) రూ.500 చెల్లించి ఆన్ లైన్‌ మరియు ఆఫ్ లైన్ లో ఆలయం వద్ద పొందవచ్చు. వ్ర‌తంలో పాల్గొన్న గృహ‌స్థుల‌కు ఉత్త‌రీయం, ర‌వికె, లడ్డు, అప్పం, బ్యాగ్, కుంకుమాది ప్రసాదములు బహుమానంగా అంద‌జేస్తారు.

ఆగ‌స్టు 6 నుండి 8వ తేదీ వ‌ర‌కు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్స‌వాలు

కార్వేటినగరం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగ‌స్టు 6 నుండి 8వ తేదీ వ‌ర‌కు తెప్పోత్స‌వాలు వైభవంగా జరుగనున్నాయి.

ఇందులో భాగంగా మొద‌టి రోజు ఆగ‌ష్టు 6న శ్రీ సీతాల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ కోదండ‌రామ‌స్వామివారు, ఆగ‌ష్టు 7, 8వ తేదీల్లో శ్రీ రుక్మిణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ వేణుగోపాల‌స్వామివారు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిస్తారు.  

ఈ మూడు రోజుల పాటు ఉద‌యం 9.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, సాయంత్రం 5 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు.

ఈ సంద‌ర్భంగా హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఆధ్యాత్మిక‌, భక్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

No comments :
Write comments