21.8.25

పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన సంగోపాంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం viswashanti mahayagam
















భక్తుల ఐశ్వర్యం, ఆయురారోగ్య సంపదలు కాంక్షిస్తూ తిరుమల ధర్మగిరిలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠంలో నాలుగు రోజులపాటు నిర్వహించిన సంగోపాంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం బుధవారం పూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిసింది.


మొత్తం 32 మంది వేదపండితుల సమక్షంలో జరిగిన ఈ మహాయాగంలో వేదపారాయణం, సుందరకాండ పారాయణం తదితర వైదిక క్రతువులు జరిగాయి.

ఈ యాగానికి హాజరైన టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు మాట్లాడుతూ సంగోపాంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం వైభవంగా ముగిసిందని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విశ్వశాంతి యాగాలు, హవనాలను నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకుందని అన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలియజేశారు.

ఈ మహాయాగంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఎస్వీ వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

No comments :
Write comments