29.8.25

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో పూర్ణాహుతితో ముగిసిన ధ్వజస్థంభ జీర్ణోదరణ vontimitta




ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం పూర్ణాహుతితో ధ్వజస్తంభ జీర్ణోదరణ శాస్త్రోక్తంగా ముగిసింది.


ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేలుకొల్పి, అర్చన జరిపారు. ఉదయం 9 గంటలకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు, వాస్తు హోమం, పంచగవ్య స్నపనం,  కుంభస్థాపనం, సయ్యాధివాసం, తత్వ హోమాలు, పూర్ణాహుతి కళాకర్షణ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, సుపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

No comments :
Write comments