శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ రూ.1.80 కోట్లు విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను శ్రీవారికి సోమవారం నాడు తిరుమలలో బహుకరించారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పేష్కార్ శ్రీ రామకృష్ణ కు స్వామీజీ కానుకలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బొక్కసం ఇన్ ఛార్జ్ శ్రీ గురురాజ్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments