23.9.25

శ్రీవారికి 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలు విరాళం gold medallions





శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ రూ.1.80 కోట్లు విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను శ్రీవారికి సోమవారం నాడు తిరుమలలో  బహుకరించారు.

ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పేష్కార్ శ్రీ రామకృష్ణ కు స్వామీజీ కానుకలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బొక్కసం ఇన్ ఛార్జ్ శ్రీ గురురాజ్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments