చిత్తూరు జిల్లా శ్రీ కలిగిరి వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 02వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 23న సాయంత్రం 06.00 గం.ల నుండి 08.00 గం.ల వరకు అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 24వ తేదీ బుధవారం ఉదయం 10.15 గం.ల నుండి 11.15 గం.ల వరకు వృశ్చిక లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో ఉదయం 08.00 గం.ల నుండి 09.00 వరకు, రాత్రి 07.00 గం.ల నుండి 08.00 గం.ల వరకు వాహన సేవలు జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
24.09.2025 ---------- శేష వాహనం
25.09.2025 తిరుచ్చి ఉత్సవం హంస వాహనం
26.09.205 సింహ వాహనం ముత్యపు పందిరి వాహనం
27.09.2025 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
28.09.205 మోహినీ ఉత్సవం గరుడ వాహనం
29.09.2025. హనుమంత వాహనం గజ వాహనం
30.09.2025. సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
01.10. 2025 రథోత్సవం అశ్వవాహనం
2. 10. 2025. చక్రస్నానం ధ్వజావరోహణం
సెప్టంబర్ 27వ తేదీ ఉదయం 11.00 గం.ల నుండి 01.00 గం.ల వరకు కల్యాణోత్సవం జరుగనుంది.
ఈ సందర్భంగా ప్రతిరోజూ టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
No comments :
Write comments