20.9.25

నూతన పీఏసీ-5 భవనంలో టీటీడీ ఈవో తనిఖీలు eo inspection









తిరుమలలో నూతనంగా నిర్మించి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పీఏసీ-5 భవనంలో శుక్రవారం టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరితో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా భవనంలోని హాళ్లు, అన్న ప్రసాద వితరణ హాలు, కల్యాణకట్ట, మరుగుదొడ్లు, తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 
సెప్టెంబర్ 25వ తేదిన పీఏసీ-5 భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా భవనంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యంత్రాన్ని పరిశీలించారు.
ఈ తనిఖీల్లో ఈవో వెంట సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు, సిఈ శ్రీ సత్య నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments