20.9.25

టీటీడీకి మొబైల్ ఫాస్ట్ ఫుడ్ వాహనం విరాళం mobile fast food vehicle




తిరుమల శ్రీవారికి శుక్రవారం బెంగళూరులోని ఎం.ఎస్.రామయ్య విద్యా సంస్థలకు చెందిన శ్రీ ఎం.ఎస్.సుందర్ రామ్ అనే భక్తుడు అన్న ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేసేందుకు రూ.14 లక్షల విలువైన అశోక్ లేల్యాండ్ కంపెనీకి చెందిన బడా దోస్త్ మొబైల్ ఫాస్ట్ ఫుడ్ వాహనాన్ని విరాళంగా అందించారు.

దీంతో పాటు టీటీడీ శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.10లక్షలు విరాళం అందించారు. 
ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ముందు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి వాహనం తాళాలు, డీడీని అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, డిఐ శ్రీ వెంకటాద్రి నాయుడు పాల్గొన్నారు

No comments :
Write comments