5.9.25

అంకురార్పణతో ప్రారంభమైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలు ankurarpanam






తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించారు. ఆలయంలో సెప్టెంబరు 05 నుంచి 07వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్ర‌హణం, వాస్తు పూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వ‌హించారు.

ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు ప్రతి సంవత్సరం  మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా సెప్టెంబరు 05వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 06న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 07న మహా పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు.
ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, అర్చ‌కులు శ్రీ శ్రీనివాస చార్యులు, శ్రీ మణికంఠ ఆచార్యులు, శ్రీ  బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ రమేశ్ , టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ చలపతి, శ్రీ సుబ్బరాయుడు, శ్రీ ప్రసాద్ పాల్గొన్నారు.

No comments :
Write comments