27.9.25

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక వైభవం CULTURAL PROGRAMES























తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ జానపద నృత్యాలు, కళారూపాలకు అద్భుత వేదికగా నిలిచాయి.

శుక్రవారం ఉదయం సింహ వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన వైవిధ్యమైన కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
మొత్తం 9 రాష్ట్రాలకు చెందిన 20 బృందాలు, 557 మంది కళాకారులు పాల్గొని వాహనసేవ వైభవాన్ని మరింతగా పెంచారు.
గుస్సడీ నృత్యం (తెలంగాణ), తిప్పని (గుజరాత్), లవణి (మహారాష్ట్ర), భరతనాట్యం, నవదుర్గ, కూచిపూడి (ఆంధ్రప్రదేశ్), బిహు నృత్యం (అస్సాం), సంపల్పురి నృత్యం (ఒడిశా), గౌరాసుర్ (ఝార్ఖండ్), శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం (కర్ణాటక), ఢాక్ నృత్యం (పశ్చిమ బెంగాల్) మొదలైన కళా ప్రదర్శనలు భక్తులకు అపూర్వమైన అనుభూతిని కలిగించాయి.

No comments :
Write comments