6.9.25

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారికి వైభవంగా పవిత్ర ప్రతిష్ట devuni kadapa




కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రెండో రోజైన శుక్రవారం పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ట చేశారు.


ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, చతుస్రనామార్చన, ద్వార తోరణ, అనంత కళా పూజ, అగ్ని ప్రతిష్ట  నిర్వహించారు.

సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు నిత్యహోమం తదితర వైదిక కార్యక్రమాలు  చేపడుతారు.

6వ తేది శనివారం పవిత్ర సమర్పణ, స్నపన తిరుమంజనం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ  అర్చకులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ఈశ్వర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

No comments :
Write comments