టీటీడీకి బుధవారం ఉదయం విద్యుత్ బస్సు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సిఈవో శ్రీ గణేష్ మణి, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శ్రీ వెంకటరమణ్ రూ.1.33 కోట్ల విలువైన విద్యుత్ బస్సును అందజేశారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ రామక్రిష్ణ, తిరుమల డిఐ శ్రీ వెంకటాద్రి నాయుడు పాల్గొన్నారు.
No comments :
Write comments