5.9.25

శ్రీ నారాపుర వేంకటేశ్వర ఆలయంలో మహా పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవములు poornahuti




కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీనారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం రాత్రి పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.


ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, కొలువు నిర్వహించారు. అనంత‌రం యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం ఉత్సవమూర్తులను ఊరేగింపు వేడుకగా జరుగనుంది.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments