3.9.25

సౌమ్యనాథ స్వామి వారి ఆలయంలో ఘనంగా పవిత్ర ప్రతిష్ట sowmyanadha swamy





అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీసౌమ్యనాథ స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా మంగళవారం ఘనంగా పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. ఉదయం 06 గం.ల నుండి మధ్యాహ్నం 1 గం. వరకు బాలబోగము, పవిత్ర హోమం, బలిహరణ, శాత్తుమొర, తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించారు. సాయంత్రం పవిత్ర హోమం, నివేదన, శాత్తుమొర, గోష్టి జరుగనుంది.


రెండోవ రోజు సెప్టెంబర్ 03వ తేదీ బుధవారం పవిత్ర సమర్పణ, పవిత్ర హోమం, శాత్తుమొర, నివేదన జరుగనుంది.

సెప్టెంబర్ 04వ తేదీ మూడోవ రోజు గురువారం మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, కుంభప్రోక్షణ, మహా నివేదన, పవిత్ర వితరణ తదితర కార్యక్రమాలు జరుగనున్నాయి. సాయంత్రం ఉత్సవమూర్తులకు  ఊరేగింపు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు శ్రీ సాయికృష్ణ, పలువురు అర్చకులు, టెంపుల్ ఇస్పెక్టర్ శ్రీ దిలీప్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.  

No comments :
Write comments