27.9.25

సింహ వాహన సేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ spiritual books





తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజైన శుక్ర‌వారం ఉదయం జరిగిన సింహ వాహన సేవలో నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌ ఆవిష్కరించారు.

ది క్వింట్సెన్స్ ఆఫ్ రిగ్ వేద ఆన్ ఇంట్రడక్షన్ - శ్రీ వాసుదేవరావు
వేదాలను వేసభగవానులు ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాలని నాలుగు వేదాలుగా విభజించారు ఈ వేద వాంగ్మయంను గురుకులాల్లో బోధిస్తూ వచ్చారు. తర్వాత కాలంలో ఈ వేద వాంగ్మయం గ్రంథస్తం చేశారు. ఋగ్వేదం మానవాళి యొక్క ప్రాచీనమైన ఆధ్యాత్మిక గ్రంథం. జీవాత్మ పరమాత్మల మధ్య ఉన్న  బంధాన్ని తెలియజేస్తుంది. 
సనాతన భారతీయ సంస్కృతి పురోగతిలో ఋగ్వేదం ఒక ప్రధానమైన మైలురాయిగా నిలిచింది. ఋగ్వేదంలోని ప్రధాన విషయాలను పరిశీలించి ఎంపిక చేసి ఆంగ్లంలో వాటికి విశేషమైన వ్యాఖ్యానాన్ని అందించారు.
శ్రీహరి భక్త విజయం - డాక్టర్ నర్సం నరసింహ చార్య
కలియుగంలో భగవంతుని చేరుకునే ఏకైక సాధనం భక్తి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు భక్తితో పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏది ఇచ్చినా స్వీకరిస్తాను అన్నారు. భక్తి లేకుండా సమర్పించిన బంగారమైన పరమాత్ముడు స్వీకరించడు. కలియుగంలో హరినామ స్మరణకు మించిన తరుణోపాయం లేనే లేదు. భగవంతుని చరిత్రను తెలుసుకోవడం, అర్థం చేసుకుని మననం చేసుకోవడం, వారి ఆదర్శాలను అందుకోవడం ద్వారా మానవ జీవనం సఫలం అవుతుంది. 
శ్రీహరి భక్త విజయం అనే గ్రంథంలో ప్రహ్లాదుడు, అంబరీష్యుడు, కుబేరుడు, ద్రువుడు, నారదుడు మున్నగు భాగవతోత్తముల కథలతో పాటు వెంకటాచలం మహత్యంలోని కథలను కూడా సులభమైన తెలుగులో అందించారు.
ఆనంద నిలయం - డాక్టర్ ఎస్ ఎస్ లీ
వెంకటాద్రి కి సమానమైన క్షేత్రం కానీ, శ్రీ వేంకటేశ్వర స్వామికి సమానమైన దైవం కానీ ఇంతకుముందు లేదు. ఇకపై ఉండబోదు అని వివిధ పురాణాలు తెలియజేస్తున్నాయి. 
శ్రీ వేంకటేశ్వర స్వామి వారు వెంకటాద్రిని చేరిన విధానం, వరాహ క్షేత్రంపై నివాసం ఏర్పరచుకొని ఆనంద నిలయ దివ్య విమానాన్ని వైకుంఠం నుండి తెప్పించుకోవడం, పద్మావతి శ్రీనివాసుల కళ్యాణంతో పాటు స్వామి పుష్కరిణి మహత్యం, తిరుమల క్షేత్రంలోని దివ్య తీర్థాలు, తొండమానుని ఇతివృత్తం మొదలైన అనేక విషయాలను కన్నడ భాషలో ఈ గ్రంథం వ్రాశారు.
ఈ కార్యక్రమంలో ప్రచురణల విభాగం ప్ర‌త్యేకాధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ, ఉపసంపాదకులు డా. నరసింహాచార్య, రచయితలు పాల్గొన్నారు.

No comments :
Write comments