7.9.25

శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్ర సమర్పణ tiruchanoor







తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు.

ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చ‌న‌ చేపట్టారు. ఆ తరువాత ఉద‌యం 11.30 గంటల నుండి పవిత్ర సమర్పణ నిర్వ‌హించారు. ఇందులో అమ్మ‌వారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు.
కాగా, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో ఆరాధన, హోమాలు, నివేదన, తీర్థప్రసాద గోష్టి తదితర వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.
సెప్టెంబర్ 07వ తేదీ ఆదివారం ఉదయం సుప్రభాతం అనంతరం సహస్రనామార్చన, నిత్యార్చన శుద్ధి చేపడుతారు. అనంతరం యాగశాలకు ఉత్సవమూర్తులు వేంచేపు చేస్తారు. యాగశాలలో హోమాలు, మహాపూర్ణాహుతి, శాంతి హోమం, పవిత్ర విసర్జనము, నివేదన, కుంభప్రోక్షణ, తీర్థప్రసాద వినియోగం చేపడుతారు. ఉదయం 10.00 గం.ల నుండి 11.30 గం.ల వరకు శ్రీకృష్ణస్వామి మఖమండపంలో స్నపన తిరుమంజనం, చక్రస్నానం చేపడుతారు. అటు తర్వాత పలు వైదిక కార్యక్రమాల తర్వాత ఆదివారం చంద్రగ్రహణంలో భాగంగా మధ్యాహ్నం 02.15 గం.లకు ఆలయాన్ని మూసివేస్తారు.
ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, ఆలయ అర్చ‌కులు, సూప‌రింటెండెంట్ శ్రీ రమేశ్, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ లు పాల్గొన్నారు.

No comments :
Write comments