15.9.25

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంగరంగవైభవంగా ఏర్పాట్లు- టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు ttd chairman inspection















సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంగరంగవైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు తెలియజేశారు.

టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆదివారం సాయంత్రం శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను చైర్మన్ తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన ప్రతి భక్తుడు వాహన సేవలను తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 
విద్యుత్ అలంకరణపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. తిరుమలలో 35 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి వాహన సేవలను తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, సిఈ శ్రీ సత్య నారాయణ, ఈఈ శ్రీ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ రాజేంద్ర కుమార్, శ్రీ సోమన్నారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments