26.9.25

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గౌ|| ఉప రాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ vice president at tiruchanoor










భారత గౌ|| ఉప రాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ గురువారం మధ్యాహ్నం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| ఉపరాష్ట్రపతికి అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆయన ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారినిదర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి, శ్రీ అనగాని సత్య ప్రసాద్, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ దివాకర్ రెడ్డి, శ్రీ రామ్మూర్తి, జిల్లా కలెక్టర్ శ్రీవెంకటేశ్వర్లు, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments