14.10.25

అక్టోబరు 16న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం sri govindaraja swamy vari temple




తిరుపతి శ్రీ స్వామివారి ఆలయంలో అక్టోబరు 20న దీపావళి ఆస్థానం సందర్భంగా 

అక్టోబర్ 16వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా అక్టోబర్ 16న ఉదయం 5 గం.లకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన, నివేదన, శాత్తుమొర జరుగనుంది, తదుపరి 6.30 గం.ల. నుండీ 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా గోడలకు (లేపనం) పూస్తారు. అనంతరం భక్తులను ఉదయం 09.30 గంటల తర్వాత సర్వ దర్శనానికి అనుమతిస్తారు.

No comments :
Write comments