శ్రీ
2026 సంవత్సరానికి సంబంధించి 12- పేజీలు, 6- పేజీలు, టేబుల్-టాప్-క్యాలెం డర్లు, డీలెక్స్ డైరీలు, చిన్ న డైరీలను, శ్రీవేంకటేశ్వర స్వా మి, శ్రీపద్మావతి అమ్మవారి పెద్ దసైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్ లను టిటిడి అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా తిరుమల, తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ఎదురుగా సేల్స్ సెంటర్, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం సమీపంలోని ధ్ యానమందిరం, శ్రీనివాసం, విష్ణు నివాసం ప్రాంతాల్లోనూ, తిరుచానూ రులో ఉన్న టిటిడి పబ్లికేషన్ స్ టాల్స్లలో అందుబాటులో ఉన్నాయి.
అంతేకాక విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్ లోని హిమయత్ నగర్ లోని ఎస్వీ ఆలయం, జూబ్లీహి ల్స్ లోని ఎస్వీ ఆలయం, బెంగళూరు , న్యూఢిల్లీ, ముంబై, వేలూరు లతో పాటు రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరులోని కళ్యాణమం డపాల్లో 2026 సంవత్సరం క్యాలెం డర్లు, డైరీలను భక్తులకు అందు బాటులో ఉంచింది.
టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లై న్ లో బుకింగ్ చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారి ఇంటి వద్దే టిటిడి డైరీలు, క్యాలండర్లను పొందే సౌలభ్యం గతంలో లాగానే ఉంది.
టిటిడి క్యాలెండర్ లు, డైరీలను టిటిడి వెబ్ సైట్ ద్వారా (www. tirumala.org, ttdevasthanams.ap.gov.in) ఆన్ లైన్ లో పొందవచ్చు.






No comments :
Write comments