2.10.25

వ‌స‌తి కేటాయింపులో సామాన్య‌ భ‌క్తుల‌కు పెద్ద‌పీఠ: డిప్యూటీ ఈవో శ్రీ భాస్క‌ర్ accommodation




శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలకు విచ్చేసిన‌ సామ‌న్య భ‌క్తుల‌కు వ‌స‌తి కేటాయింపులో పెద్ద‌పీఠ వేసిన‌ట్లు టీటీడీ వ‌స‌తి విభాగం డిప్యూటీ ఈవో శ్రీ భాస్క‌ర్ అన్నారు. తిరుమ‌ల‌లోని రామ్ భ‌గీచా-2లో ఏర్పాటు చేసిన మీడియా సెంట‌ర్ లో ఆయ‌న బుధ‌వారం ఉద‌యం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ గ‌రుడ‌వాహ‌నం రోజున వీఐపీల ర‌ద్దీ అధికంగా ఉన్న‌ప్ప‌టికీ సామాన్య భ‌క్తుల‌కు దాదాపు 2500 గ‌దులు కేటాయించామ‌ని చెప్పారు. సాధార‌ణ రోజుల్లో సామ‌న్య భక్తుల‌కు 50 శాతం కేటాయిస్తున్న‌ట్లు తెలిపారు. 
తిరుమ‌ల‌లో నూత‌న యాత్రికుల వ‌స‌తి స‌ముదాయం -5 అందుబాటులోకి రావ‌డంతో వ‌స‌తి గ‌దుల కోసం ఒత్తిడి త‌గ్గింద‌ని తెలియ‌జేశారు. ఇందులో 2400 లాక‌ర్లు భ‌క్తుల‌కు అందుబాటులో ఉన్నాయ‌ని పేర్కొన్నారు.అన్న‌ప్ర‌సాదం, క‌ల్యాణ‌క‌ట్ట సౌక‌ర్యాల‌ను అందుబాటులో ఉంచి 10వేల మంది భ‌క్తులకు వ‌స‌తి క‌ల్పించే విధంగా ఏర్పాట్లు చేశామ‌న్నారు.

No comments :
Write comments