తిరుమల శ్రీ
బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపజేశారు. శ్ రీవారికి భక్తులు అడుగడుగునా నీ రాజనాలు సమర్పించారు. గోవిందనా మస్మరణతో ఆలయ మాడవీధులు మారుమో గాయి.
అనాదికాలం నుండి రాజులకు రథసంచా రం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నా యి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్ తాడు. ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవవేళలో దేవుని ఉత్సవమూర్తి ని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం, ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచా రంలో ఉంది.
తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైంది. ’రథస్థం కేశవం దృష్ట్వా పునర్ జన్మనవిద్యతే ’ అన్న ఆర్షవాక్కు లు రథోత్సవం మోక్షప్రదాయకమని వి వరిస్తున్నాయి. తిరుమాడ వీధులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్ రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందు కు లాగారు.
రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యా త్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికీ ఉండే సంబంధా న్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్ గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయా లే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో – స్థూలశరీరం వేరనీ, సూక్ష్మశరీరం వేరనీ, ఆత్ మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే . భక్తులు రథాన్ని లాగుతారు, కా నీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్ యామిగా ఉన్న పరమాత్మ తనరథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచి తం.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్ రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో శ్రీ వీ రబ్రహ్మం, సివిఎస్వో శ్రీ ము రళి కృష్ణ,
ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్ నారు.






No comments :
Write comments