2.10.25

బ్ర‌హ్మోత్స‌వాల్లో క‌ల్యాణ క‌ట్ట‌లో క్షుర‌కుల సేవ‌లు అభినంద‌నీయం: క‌ల్యాణ‌క‌ట్ట డిప్యూటీ ఈవో శ్రీ వెంక‌ట‌య్య‌ kalyana katta




శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించేందుకు నిరంత‌రాయంగా కృషి చేసిన క‌ల్యాణ క‌ట్ట క్షుర‌కుల సేవ‌లు అభినంద‌నీయ‌మ‌ని ఆ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ వెంక‌ట‌య్య అన్నారు. తిరుమ‌ల‌లోని రామ్ భ‌గీచా-2లో ఏర్పాటు చేసిన మీడియా సెంట‌ర్ లో బుధ‌వారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించేందుకు 1148మంది క్షుర‌కులు సేవ‌లు అందించార‌ని చెప్పారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో గ‌త ఏడు రోజుల్లో 2.11 ల‌క్ష‌ల మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించ‌గా, నాలుగో రోజున అత్య‌ధికంగా 49,088 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించార‌ని తెలిపారు. ఈ ఏడాది గరుడ సేవ అన్నాడు గత ఏడాది కన్నా పదివేల మంది పైగా భక్తులు అధికంగా తలనీలాలు సమర్పించారని తెలిపారు.
నూత‌న యాత్రికుల వ‌స‌తి స‌ముదాయం-5లో కూడా మూడు షిప్టుల్లో 120 క్షుర‌కులు నిరంత‌రాయంగా సేవ‌లు అందించార‌ని తెలిపారు.
త‌ల‌నీలాలు స‌మ‌ర్పించేందుకు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఏర్పాట్లు చేయ‌డంతో భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేశార‌ని తెలియ‌జేశారు.

No comments :
Write comments