21.10.25

అమరావతిలోని ఎస్వీ ఆలయాన్ని సందర్శించిన టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు amaravati temple




అమరావతిలోని వెంకటపాలెం సమీపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు సోమవారం సందర్శించారు. 


సాధారణ భక్తుడి వలే నడుచుకుంటూ టిటిడి ఛైర్మన్ దర్శనానికి వెళ్లారు. ఆలయంలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. కొందరు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దేవదేవుడి అలంకరణ, క్యూలైన్లు, ఏర్పాట్లుపై స్థానిక అధికారులు, సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆలయ ఉద్యోగులు ఇలాంటి నిర్లక్ష్యాన్ని వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై దేశంలోని అన్ని శ్రీవారి ఆలయాలను ఆకస్మికంగా సందర్శించాలని చైర్మన్ నిర్ణయించారు. 

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని, నిర్వహణ మరింత నాణ్యంగా ఉండాలని అధికారులకు ఆయన సూచించారు. 

టిటిడి చైర్మన్ ఆలయానికి చేరుకోగానే టెంపుల్ అర్చకులు, ఇన్స్పెక్టర్లు శ్రీ రామకృష్ణ, సందీప్ స్వాగతం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. 

No comments :
Write comments