11.10.25

శ్రీవారి బ్రహ్మోత్సవాల విజయవంతం స్ఫూర్తితో శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథ పప్తమి వేడుకలను విజయవంతం చేయాలి - టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ammavari brahmostavalu













తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయం అయిన నేపథ్యంలో అదే స్ఫూర్తితో తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలను, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి వేడుకలను విజయవంతం చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల తర్వాత సమీక్ష సమావేశం శుక్రవారం తిరుపతి మహాతి ఆడిటోరియంలో నిర్వహించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఎటు చూసినా ఈసారి అనూహ్యంగా సానుకూల  వాతావరణం కనిపించిందని టిటిడి ఈవో తెలిపారు. భక్తులకు టిటిడి కల్పించిన సౌకర్యాలపై గ్యాలరీలు, క్యూలైన్లలోని భక్తులు 100 శాతం సంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హమన్నారు. బ్రహ్మోత్సవాలకు  ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించేందుకు వెళ్లిన సమయంలో సిఎంగారు పలు సూచనలు చేశారని, టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు, పాలక మండలి సభ్యులు, జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ విభాగం, టిటిడిలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయం, శ్రీవారి సేవకుల సేవలు, భక్తులు, మీడియా సమిష్టి సహకారంతో విజయవంతం అయ్యాయన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి చివరి రోజు వరకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజునే దేశ ఉప రాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గార్లు పర్యటన, పీఏసీ - 5 ప్రారంభోత్సం తదితర కార్యక్రమాలు ఉన్నా అందరూ సమిష్టిగా పనిచేశారన్నారు.
బ్రహ్మోత్సవాలలో గ్యాలరీలలోను, క్యూలైన్లలోను, గరుడ సేవ రోజు  ప్రణాళికా బద్ధంగా ప్రతి ఒక్క భక్తుడికి అన్నప్రసాదాలు అందించేలా, ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేందుకు పారిశుద్ధ్య పనులు చేశారని, ఆకట్టుకునేలా విద్యుత్ కాంతులు, పుష్ప అలంకరణలు, రవాణా, ట్రాఫిక్,   తదితర సేవలలో అందరూ చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. వచ్చే బ్రహ్మోత్సవాలకు సిసి కెమెరాలను అనుసంధానం చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్, రియల్ టైం ఫీడ్ బ్యాక్ తీసుకుని భక్తుల ఇబ్బందులను అంచనా వేసి అందుకు తగ్గ ఏర్పాట్లు చేపట్టేందుకు ఇప్పటి నుండే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.  
ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకు ప్రణాళికాబద్ధంగా సౌకర్యాలు కల్పించేలా మూడు నెలల ముందు నుండే మార్గదర్శిని రూపొందించామన్నారు.  అనివార్య కారణాలతో రాలేకపోయినా ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు కాన్పరెన్స్ లతో సమీక్షించుకున్నామన్నారు. టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు, అనుభవజ్ఞులైన ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారి సూచనలతో సమిష్టిగా పనిచేశారన్నారు. బ్రహ్మోత్సవాలపై ప్రతి అంశాన్ని నమోదు చేసుకుని రాబోవు రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఈ సందర్భంగా జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం మాట్లాడుతూ, ప్రతి రోజూ అధికారులతో సమీక్షించుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరూ ఒక టీం వర్క్ గా పని చేశారన్నారు, ముఖ్యంగా మాడ వీధులతో పాటు బయట క్యూలైన్లలోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్నప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ, పాలు, బాదం పాలు అందించేందుకు సిబ్బంది చక్కగా పని చేశారన్నారు. ఇదే స్ఫూర్తితో సమన్వయంతో తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేయాలన్నారు. 
జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ భక్తుల రద్దీని నియంత్రించేందుకు క్యూలైన్లు ఏర్పాటు, టిటిడి, విజిలెన్స్, పోలీసులు సమన్వయంతో పనిచేశారన్నారు. ఈ ఏడాది టెక్నాలజీ సేవలను బాగా సద్వినియోగం చేసుకున్నామన్నారు. కమాండ్ కంట్రోల్ నుండి ఎప్పటికప్పుడు సమీక్షించుకుని తిరుమల,  తిరుపతిలలో పార్కింగ్ సమస్య లేకుండా, వృద్ధులకు సేవలు, చిన్న పిల్లలకు జియో ట్యాగ్ సిస్టం ఏర్పాటు, సోషల్ మీడియా, సైబర్ వింగ్ చాలా అప్రమత్తంగా పనిచేశారన్నారు. తిరుపతి జేఈవో నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా అధికారులు, సిబ్బందిని సమన్వయం చేశారన్నారు.
టిటిడి సివిఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ మాట్లాడుతూ, టిటిడి ఏర్పాట్లపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అభినందించడం ఆనందం వేసిందన్నారు. ఈ ఏడాది అదనంగా 40 వేల మంది భక్తులు వచ్చినా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. టిటిడి నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ మరింత జాగురూకతతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో  టిటిడి మరియు పోలీసు ఉన్నతాధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

No comments :
Write comments