13.10.25

చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం chandragiri




చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

మొదటిరోజు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు చతుష్టార్చన, పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు.  అనంతరం సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అనంత‌రం యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, ప‌విత్ర ప్ర‌తిష్ట నిర్వ‌హించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పవిత్ర హోమాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆల‌య‌ సూపరింటెండెంట్ జ్ఞాన ప్ర‌కాష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ముని హ‌రిబాబు,  విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments