24.10.25

శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన గణపతి హోమం ganapati homam





తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా రెండు రోజుల పాటు జరిగిన శ్రీ గణపతి హోమం గురువారం ఘనంగా ముగిసింది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు.


ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు పూజ, నిత్యహోమం, మహాపూర్ణాహుతి, గణపతి కలశ ఉద్వాసన, మూలవర్లకు మహాభిషేకం, కలశాభిషేకం,  నివేదన, హారతి నిర్వహించారు.

సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి  కలశస్థాపన, లఘు పూర్ణాహుతి, విశేష దీపారాధన నిర్వహిస్తారు.

గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు హోమంలో పాల్గొన్నారు.

శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం :

శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 24  నుండి 26వ తేదీ వ‌ర‌కు శ్రీసుబ్రహ్మణ్య స్వామివారి హోమం మూడు రోజుల పాటు ఘనంగా జరుగనుంది.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమ‌తి నాగ‌ర‌త్న‌, సూప‌రింటెండెంట్‌ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments