1.10.25

వేడుక‌గా బంగారు గొడుగు ఉత్సవం golden umbrella






తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం మంగ‌ళ‌వారం సాయంత్రం తిరుమలలోని కల్యాణకట్టలోని ప్రధాన బిల్డింగ్ లో అత్యంత ఘనంగా జరిగింది. అక్టోబ‌ర్ 1వ‌ తేదీ బుధ‌వారం శ్రీవారి రథోత్సవాన్ని పురస్కరించుకొని అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయం మేరకు ముందురోజు సాయంత్రం శ్రీవారి కల్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపనాన్ని చేస్తారు.


చారిత్రక నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయలు కాలంలో చంద్రగిరిరాజు శ్రీనివాస మహదేవ రాయలు చేసిన ధర్మ శాసనం ప్రకారం పంతులుగారి వంశస్తులు ఈ హక్కును కొన్ని శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారు. తొలి రోజుల్లో కొయ్య గొడుగుతో ప్రారంభమై, అటు తరువాత 1952 నుండి రథానికి బంగారు గొడుగు సమర్పించడం జరుగుతున్నది.
కాగా పంతులుగారి ప్రస్తుత వంశీకుడైన పంతులుగారి శ్రీ రామనాథన్‌ ఆధ్వర్యంలో కల్యాణకట్ట క్షురకులు, సిబ్బంది, సభ్యులు ఈ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం తిరుమలలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మ‌న్‌ శ్రీ రుద్రకోటి సదాశివం, కల్యాణకట్ట డిప్యూటీ ఈవో శ్రీ పి.వెంకటయ్య, ఏఈవో శ్రీ సి.ఏ.అమరనాధ్, సూపరింటెండెంట్ శ్రీ జి.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments