1.10.25

శ్రీవారి సేవకుల అపూర్వమైన సేవలతో గరుడ సేవ విజయవంతం: టీటీడీ సీపీఆర్వో డాక్టర్ టి.రవి IMPECCABLE SERVICES




శ్రీవారి సేవకుల అపూర్వమైన సేవలు గరుడసేవను విజయవంతం చేశాయని టీటీడీ చీఫ్ పిఆర్వో డాక్టర్ టి. రవి తెలిపారు.

తిరుమలలోని రామ్ భగీచ -2 లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ లో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాల్లో 3500 మంది శ్రీవారి సేవకులు, 400 మంది పరాకమణి సేవకులు, 100 మంది గ్రూప్ సూపర్వైజర్లు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకుని శ్రీవారి సేవకు విచ్చేశారని చెప్పారు.
గరుడసేవ రోజున నాలుగు మాడ వీధుల్లో సుమారు 2000 మంది సేవకులను ప్రత్యేకంగా నియమించామని ఆయన తెలిపారు. వీరిలో 800 మంది అన్నప్రసాదం, 700 మంది హెల్త్ డిపార్ట్‌మెంట్, 200 మంది హోల్డింగ్ పాయింట్లు, 300 మంది విజిలెన్స్ & పోలీస్ విభాగాల్లో సేవలందించారని పేర్కొన్నారు.
ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి సేవకులతో చైన్ లింక్‌లను ఏర్పాటు చేసి గ్యాలరీ చివరిలో ఉన్న భక్తుడి వరకు అన్నప్రసాదం, పానీయాలు, త్రాగునీరు అందేలా చర్యలు చేపట్టామని ఆయన వివరించారు.
100 మందికి పైగా గ్రూప్ సూపర్వైజర్లలో కొందరు రిటైర్డ్ గెజిటెడ్ అధికారులు కూడా ఉన్నారని, వారు విశేషమైన సేవలు అందించారని సిపిఆర్వో తెలిపారు.
సెప్టెంబర్ 28న ఉదయం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు దాదాపు 20 గంటల పాటు శ్రమించి సేవకులు అపూర్వమైన సేవలు అందించారని, వారి సేవలను భక్తులు మాత్రమే కాకుండా టీటీడీ విభాగాలు కూడా అభినందించాయని ఆయన పేర్కొన్నారు. ఈ విజయానికి సేవా సదన్ సిబ్బంది చేసిన సమగ్ర ప్రణాళిక, సమిష్టి కృషే కారణమని ఆయన అభినందించారు.
ఈ సమావేశంలో టీటీడీ పిఆర్వో (ఎఫ్ఏసీ) కుమారి పి.నీలిమ కూడా ఉన్నారు.

No comments :
Write comments