31.10.25

తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు metlotsavam





శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవంలో భాగంగా గురువారం తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.


ఈ సందర్భంగా దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు  స్వామివారి వైభవం, మెట్లోత్సవం విశిష్టతను భక్తులకు వివరించారు.

అనంతరం నామ సంకీర్తన, సామూహిక భజన, హరిదాసులు అందించిన ఉపదేశాలు, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

కాగా శుక్రవారం ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం నుండి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ప్రారంభం కానుంది. భజన మండలి సభ్యులు సాంప్రదాయ భజన చేస్తూ తిరుమలకు చేరుకుంటారు.

No comments :
Write comments