వేం
స్వామివారి సేవలో తరించిన శ్రీ వైష్ణవ భక్తాగ్రేసుల వర్ష తిరు నక్షత్రోత్సవాలను పవిత్ర దినాలు గా వ్యవహరించడం కద్దు. అందులో భాగంగా ఈ మాసంలో ఎంతోమంది శ్రీ వైష్ణవాచార్యుల తిరు నక్షత్రోత్ సవాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అక్టో బర్ 24న తిరుమల నంబి శాత్తుమొర, అక్టోబర్ 27న మణవాళ మహామునుల శాత్తుమొర, అక్టోబర్ 30న వేదాం త దేశికుల శాత్తుమొర నిర్వహిం చనున్నారు.
తిరుమల నంబి
తిరుమల నంబి శ్రీవారి భక్తి పరం పరలో ప్రముఖ శ్రీవైష్ణవ ఆచార్యు లు. 11వ శతాబ్దంలో జీవించిన ఆయన శ్ రీ వేంకటేశ్వరునికి నిత్యసేవ చే యడమే జీవిత ధర్మంగా భావించిన మహాభక్తుడు. ఆకులతో నీటిని కొం డపైకి తీసుకెళ్లి స్వామివారికి సేవ చేసిన సేవామూర్తి గా ఆయన ప్ రసిద్ధి చెందారు.
మణవాళ మహామునులు
మణవాళ మహామునుల వారు 15వ శతాబ్ దానికి చెందిన ప్రముఖ శ్రీవైష్ ణవ ఆచార్యులు. రామానుజీయ విశిష్ టాద్వైత సిద్ధాంతాన్ని ప్రజల్లో విస్తరించి, గురుపరంపర పరిరక్ షణలో అపూర్వ కృషి చేసి "శిష్య తిలకము" అనే బిరుదు పొందిన మహో న్నత ఆచార్యులు.
వేదాంత దేశికులు
వేదాంత దేశికుల వారు 13–14వ శతా బ్దాలకు చెందిన మహానుభావ శ్రీవై ష్ణవ ఆచార్యులు, తత్వవేత్తలు మరియు కవులు. విశిష్టాద్వైత సి ద్ధాంతాన్ని రక్షించి, ప్రచారం చేసి, “కవి తార్కిక సింహం”, “వేదాంతాచార్యులు” వంటి బిరుదు లు పొందారు. సంస్కృతం మరియు తమి ళంలో 120కు పైగా గ్రంథాలు రచిం చిన వీరు శ్రీరామానుజాచార్యుల ఉపదేశాలను ప్రపంచవ్యాప్తంగా స్ థిరపరచిన మహామహులు.
వీరి వర్ష తిరు నక్షత్రోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి అప్పపడిని పంపడం సాంప్ రదాయంగా వస్తోంది. తమ భక్తులకు స్వామివారు స్వయంగా ప్రసాదాలను పంపే ఆచారంగా దీనిని భావిస్తారు .
ఈ పడిలో 51 అప్పాలు, పచ్చ కర్పూ రం, గంధపు చెక్క ఉంచి తిరుమల అర్చకులు, జీయర్ స్వాములు, అర్ చకుల సమక్షంలో శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఈ పడిని పోటు పరిచారకులు ఆలయ నా లుగు మాడ వీధుల గుండా ఊరేగిస్తూ తిరుపతిలోని శ్రీ కోదండరామ స్ వామి ఆలయానికి చేర్చుతారు. ఆయా సన్నిధికి చెందిన ఆచార్య పురుషు ల శిష్యుల ద్వారా పడిని ఊరేగిం పుగా తీసుకువెళ్లి గోవిందరాజస్ వామి ఆలయంలో వెలసివున్న ఆయా ఆచా ర్యుల సన్నిధిలో శాత్తుమొర ని ర్వహిస్తారు.

No comments :
Write comments