13.11.25

న‌వంబ‌రు 16న శ్రీనివాసమంగాపురంలో కార్తీక వనభోజనం srinivasa manga puram




టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో న‌వంబ‌రు 16న కార్తీక వనభోజన కార్యక్రమం జరుగనుంది. ఈ కార‌ణంగా నిత్య‌ కల్యాణోత్సవం ఆర్జిత సేవ ర‌ద్ద‌యింది. పవిత్రమైన కార్తీక మాసంలో ఇక్క‌డ వనభోజన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.


ఇందులో భాగంగా ఉదయం 7 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి ఉదయం 9 గంటలకు శ్రీవారి మెట్టు వద్దగల పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ఆ తరువాత అలంకారం, వ‌న‌భోజ‌నం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్క‌డి నుండి సాయంత్రం 4 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

No comments :
Write comments