15.11.25

వేద విద్యార్థులకు వస్త్రాలు పంపిణీ clothes distribution




తిరుమలలోని ధర్మగిరిలో ఉన్న వేద విజ్ఞానం పీఠంలో వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి శుక్రవారం వస్త్రాలను పంపిణీ చేశారు.


సంవత్సరానికోసారి వేద పాఠశాలలోని విద్యార్థులకు టీటీడీ వస్త్రాలు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా 4 పంచెలు, ఒక దుప్పటి చొప్పున 380 మంది విద్యార్థులకు అదనపు ఈవో పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ శివ సుబ్రహ్మణ్య అవధాని, వేద పండితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments