తిరుపతిలోని టీ
ముందుగా ఎస్వీ సంగీత నృత్య కళా శాల ఆధ్వర్యంలో మంగళ ధ్వని, తి రుమల ధర్మగిరి వేద పాఠశాల ఆగమ పండితులు శ్రీ రాఘవేంద్ర వేదస్ వస్తి, అనంతరం దీప ప్రాశస్త్యా న్ని తెలియజేశారు.
అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్ రీ వేంకటేశ్వర స్వామివారికి, శ్ రీ చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవా రికి తిరుమల శ్రీవారి ఆలయ అర్ చకులు వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసర్చన నిర్వహించారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం పండి తులు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. ఆ తర్వాత అర్ చక స్వాములు శ్రీ మహాలక్ష్మి పూ జ చేపట్టారు.
అనంతరం ఎస్వీ సంగీత, నృత్య కళా శాల ఆధ్వర్యంలో ప్రదర్శించిన " శ్రీ లక్ష్మి ఆవిర్భవం" నృత్య రూపకం భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంది.
తరువాత భక్తులతో దీప మంత్రం మూ డు సార్లు పలికిస్తూ సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు. ఈ సందర్బంగా భక్తులందరూ ఒక్కసా రిగా చేసిన దీపారాధనతో మైదానం వెలుగుతో నిండిపోయింది.
చివరగా టీటీడీ అన్నమాచార్య ప్రా జెక్టు కళాకారులు గోవిందనామాలు పాడుతుండగా నక్షత్రహారతి, కుం భహారతి సమర్పించారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసా రం చేసింది.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జి.భాను ప్రకాష్ రెడ్డి, జేఈవో శ్రీ వి. వీరబ్ రహ్మం దంపతులు, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులలో ఒకరు మరి యు ఆగమ సలహాదారులు శ్రీ కృష్ణశే షాచల దీక్షితులు, సంక్షేమ విభా గం డిప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు, హెచ్‌డిపీపీ సెక్రటరీ శ్రీ శ్ రీరాం రఘునాథ్, అర్చక బృందం, వే ద పండితులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.











No comments :
Write comments