తిరుమల శ్రీ వేం
1.శ్రీ రమేష్, మహారాష్ట్ర.
ప్రశ్నః వైకుంఠ ఏకాదశి టికెట్ లు ఎప్పుడు విడుదల చేస్తారు?
ఈవోః భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుని పా రదర్శకంగా టోకెన్లు కేటాయిం చేందుకు చర్యలు చేపట్టాం. త్ వరలో వివరాలు తెలియజేస్తాం.
2.కిరణ్, గుంటూరు.
ప్రశ్నః దివ్యాంగుల దర్శనంలో సహాయకులను తీసుకొచ్చేందుకు అనుమతించండి? క్యూలైన్ లో వెయి టింగ్ లేకుండా దర్శనం చేసుకు నేలా చర్యలు తీసుకోండి?
ఈవోః దివ్యాంగులకు శ్రీవారి సేవకుల సహాయంతో దర్శనానికి వెళ్లే ఏర్పాటు ఉంది. భక్తులం దరికీ ఇబ్బంది లేకుండా ఉండేందు కు క్యూలైన్ల నిర్వహణ తప్ప నిసరి.
3. గోకుల్, బెంగుళూరు.
ప్రశ్నః ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడం సాధ్యపడటం లేదు?
ఈవోః లక్షలాది మంది భక్తులు దర్శనం టికెట్ల బుక్ చేసుకునేం దుకు ప్రయత్నిస్తుంటారు. తిరు పతిలో రోజుకు 20 వేల సర్వదర్ శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయి . ఆన్ లైన్ లో కోటా పెంచడం వీ లు పడదు.
4.మణికంఠ, అనంతపురం.
ప్రశ్నః ఆన్ లైన్ లో దర్శన టికెట్ల బుకింగ్ సమయంలో ఓటీపీ రావడానికి ఆలస్యమవుతోంది? దర్శన క్యూలైన్ లో సిబ్బంది తోసేస్తున్నారు.
ఈవోః భక్తుల సలహాలు, సూచన ల మేరకు ఓటీపీ విధానం తీసుకురా వడం జరిగింది. మీ సమస్యను పరిష్కరిస్తాం. దర్శన క్యూ లైన్ లో భక్తులతో మెలిగే విధా నంపై శ్రీవారి సేవకులకు శిక్ షణా కార్యక్రమం నిర్వహించా లని నిర్ణయం తీసుకున్నాం.
5.శంకర్ గౌడ్, హైదరాబాద్.
ప్రశ్నః మూడు నెలలు అడ్వాన్స్ గా టికెట్లు బుక్ చేసుకునే విధా నం ఇబ్బందిగా ఉంది? ప్రతిరోజూ టికెట్లు బుక్ చేసు కునే విధానం ఉంటే బాగుంటుంది?
ఈవోః భక్తులందరికీ ఇబ్బంది లే కుండా అడ్వాన్స్ బుకింగ్ విధానం తీసుకురావడం జరిగింది.
6.గణేష్, కడప.
ప్రశ్నః 2023లో ఇంజినీరింగ్ వి భాగంలో ఉద్యోగాలకు నోటిఫికేష న్ ఇచ్చారు. కానీ నియామకాలు జ రగలేదు?
ఈవోః ఈ విషయం నా దృష్టికి వచ్ చింది. 15 రోజుల్లో ఈ సమస్యను పరి ష్కరిస్తాం.
7.జగన్, జగిత్యాల.
ప్రశ్నః ప్రత్యేక ప్రతిభావంతు లకు ఆఫ్ లైన్ కోట పెంచుతామన్నా రు. ఎస్ఎస్ డి టోకెన్ తీసుకునేం దుకు ప్రత్యేక లైను ఏర్పాటు చే యండి?
ఈవో : ఆన్ లైన్, ఆఫ్ లైన్ దర్ శనం టోకెన్ల జారీపై టీటీడీ బోర్ డు కమిటీని ఏర్పాటు చేసింది. అదేవిధంగా భక్తులు నుండి అభిప్ రాయ సేకరణ చేస్తున్నాం. కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుం టాం.
8. ఈశ్వర్, అనంతపురం
ప్రశ్న తిరుమలలో కొంతమంది ప్రజా ప్రతినిధుల పీఆర్వోలు అధిక రేట్ లకు దర్శనం టికెట్లు అమ్ముతున్ నారు కట్టడి చేయండి.
ఈవో : గౌరవ ప్రజాప్రతినిధులకు టీటీడీ ఈ సౌకర్యం కల్పించింది. కొంతమంది దళారులు డబ్బు తీసుకొ ని భక్తులను మోసగిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. దళారులను నమ్మవద్దు, శ్రీవాణి ట్రస్ట్ ద్ వారా టికెట్లు పొంది స్వామివా రిని దర్శించుకోండి.
9. రవికుమార్, కావలి
ప్రశ్న : విద్య వైద్య రంగాలలో టిటిడి చేస్తున్న కృషి అభినందనీ యం, టిటిడి ఆధ్వర్యంలో ఐ బ్యాం క్ స్థాపించండి, శ్రీవారి భక్తు లు పెద్ద సంఖ్యలో నేత్రదానం చే స్తారు.
ఈవో : తిరుమల శ్రీవారి దర్శనాని కి విచ్చేసే భక్తులకు ఆరోగ్య సమస్యలు లేకుండా వైద్య సౌకర్యా లు అందిస్తుంది. శ్రీవారి భక్తు లకు నేత్రదానంపై అవగాహన కల్పిం చేందుకు సాధ్యసాధ్యాలు పరిశీలి స్తాం.
10. ముని లక్ష్మి, తిరుపతి
ప్రశ్న : తిరుపతిలో ఎస్ఎస్ డి టోకెన్లు మధ్యాహ్నం 12 గంటల తర్ వాత ఇస్తున్నారు. దర్శనం టోకెన్ లు ఉదయం ఇవ్వడం వల్ల భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ఆన్ లైన్ లో శ్రీనివాస దివ్యనుగ్రహ హోమం బు క్ చేసుకో నేందుకు తల్లిదండ్రు లకు మాత్రమే అవకాశం ఉంది పిల్ లలకు రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ లు జారీ చేయండి. విఐపిల దర్శనా ల సంఖ్య తగ్గించండి. టిటిడి కా ల్ సెంటర్లో ఉచితంగా సేవలు అందిం చే అవకాశం కల్పించండి.
ఈవో : ఎస్ఎస్ డి టోకెన్ల జారీ సమయం మార్పుపై కమిటీ పరిశీలిస్ తుంది. హోమం టికెట్లు మొత్తం కు టుంబానికి కేటాయించే విషయం పరి శీలిస్తాం. విఐపి లకు కేటాయించే దర్శన సమయం తక్కువ, సామాన్య భక్తులకు ఎక్కువ సమయం కేటాయిస్ తున్నాం. శ్రీవారి సేవకురాలిగా కాల్ సెం టర్ లో సేవలు అందించేందుకు త్ వరలో విధివిధానాలు రూపొందిస్తు న్నాం.
11. హరిణి, బెంగుళూరు
ప్రశ్న : వయోవృద్ధులు దర్శనం టో కెన్లు పొందేందుకు ఆధార్ అప్ లో డ్ చేసేలోపు టికెట్లు అయిపోతున్ నాయి. దీనిని పరిశీలించగలరు.
ఈవో : భక్తులు రిజిస్ట్రేషన్ చే సే సమయంలో వారి డేటా పొందుపరిచా రు. టికెట్లు బుక్ చేసే సమయంలో మళ్ళీ ఆధార్ అప్ లోడ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
12. రమేష్ బెంగళూరు
ప్రశ్న : శ్రీవారి ఆలయంలో కల్యా ణోత్సవం నిర్వహించే మండపంలో ఒక చోట మాత్రమే తాగునీరు ఉంది. మరొ కటి ఏర్పాటు చేయండి.
ఈవో : చర్యలు తీసుకుంటాం.
13. సాయి చరణ్, ఖమ్మం
ప్రశ్న : శ్రీవారి దర్శనం టికె ట్లు పొందే సమయంలో క్రెడిట్, డె బిట్ కార్డులు బదులుగా ఆర్బిఐ సూచించిన యూపీఐ ద్వారా చెల్లిం చే సౌలభ్యం కల్పించండి.
ఈవో : ఐటీ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటాం.
14. వాసు రావు హైదరాబాద్ ప్రశ్ న : సప్తగిరి మాసపత్రిక నెల నె ల రావడం లేదు.
ఈవో : సప్తగిరి మాస పత్రిక చందా దారులందరికీ ప్రతి నెల అందేలా చర్యలు తీసుకుంటాం.



No comments :
Write comments