తిరుమలోని
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వ ర్యులు శ్రీ నారా చంద్రబాబు నా యుడు ఆదేశాల మేరకు భక్తులకు ఎప్పటికప్పుడు మరింత మెరుగై న సకర్యాలు కల్పించేందుకు టీ టీడీ అభిప్రాయ సేకరణపై ప్రత్ యేక దృష్టి పెట్టింది. ఐవీఆర్ ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవ కుల ద్వారా భక్తుల నుండి క్ర మంగా అభిప్రాయాలను సేకరించడం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌ దరి పద్మావతి విశ్రాంతి భవ నంలోని సమావేశ మందిరంలో శనివా రం ఉదయం భక్తుల నుండి అక్టోబ ర్ నెలలో సేకరించిన అభిప్రాయా లపై విభాగాల వారీగా సమీక్ష ని ర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన అభిప్రాయాల పై అధికారులతో చర్చిస్తూ పలు అదేశాలు జారీ చేశారు. కాలిబాట మార్గాల్లో పంచాయతీ, ఆరోగ్య వి భాగాలు కలసి తరచూ తనిఖీలు నిర్వహించి ఆ మార్గాల్లోని దు కాణాల్లో వస్తువుల ధరలను పర్యవేక్షించాలన్నారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్ న ప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించేటప్ పుడు అన్న ప్రసాదం సిబ్బంది చే తులకు తొడుగులు ధరించి ప్రసా దాలు వడ్డించాలని సూచించారు. భక్తులు చేతులు కడుగు ప్రదేశం, హాళ్లలో తడి లేకుండా పరిశుభ్రం గా ఉంచాలన్నారు.
లగేజీ కౌంటర్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు సకాలంలో లగేజీ అందేలా సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని చె ప్పారు. భక్తులు గదుల కాషన్ డి పాజిట్ తిరిగిపొందడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిసెప్షన్ విభా గం చర్యలు తీసుకోవాలన్నారు.
ఏటీసీ నుండి ఆక్టోపస్ సర్కిల్ వరకు ఉండే క్యూలైన్లలో భక్తులకు అన్న ప్రసాదం, తాగునీరు అందేలా అధికారులు నిత్యం క్యూలైన్లను పర్యవేక్షించాలన్నారు.
అదేవిధంగా క్యూలైన్లు, కంపార్ట్ మెంట్లలో పరిశుభ్రత విషయంలో రా జీ పడకూడదని ఆదేశించారు.
అన్న ప్రసాదం, ఆరోగ్య, విజిలె న్స్, క్యూలైన్ల నిర్వహణ, ల డ్డూ కౌంటర్ విభాగాలపై వచ్చి న భక్తుల అభిప్రాయాలను పరిగ ణలోకి తీసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్ పారు. తదుపరి సమావేశంలో వాటి పురోగతిపై రిపోర్టు సమర్పిం చాలని చెప్పారు.
అనంతరం గోపార్క్ టెక్నాలజీ ప్ రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతిని ధి తిరుమలలోని పార్కింగ్ సమస్ య పరిష్కారాలకు పార్కింగ్ యాప్ అభివృద్ధి, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రణాళిక, పార్కిం గ్ ప్రీ బుకింగ్, నిర్దేశిత పా ర్కింగ్ జోన్లు గుర్తింపు, తది తర అంశాలను పవర్ పాయింట్ ప్రె జెంటేషన్ ద్వారా తెలియజేశారు.
ఈ సమావేశంలో టీటీడీలోని వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.

No comments :
Write comments