16.11.25

భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు INDIAN CRICKETER





ఇటీవల జరిగిన మహిళా క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ జట్టు ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర వహించిన కడప జిల్లాకు చెందిన భారత మహిళా క్రికెటర్ శ్రీ చరణిని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు అభినందించారు. 


శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం శ్రీ చరణి శనివారం తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా చైర్మన్ ఆమెను శాలువతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

శ్రీవారి ఆశీస్సులతో భవిష్యత్తు లో క్రికెట్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా చైర్మన్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా పాల్గొని  శ్రీచరణికి అభినందనలు తెలిపారు.

No comments :
Write comments