10.11.25

శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా లక్షబిల్వార్చన laksha bilwarchana







తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం లక్ష బిల్వార్చన సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.


ఇందులో భాగంగా ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహించారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ జరిగింది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చించారు.

సాయంత్రం శ్రీ చంద్ర‌శేఖ‌ర స్వామివారి ఉత్సవమూర్తులు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments