తిరుచానూ
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, భక్తుల రద్దీని ముందస్తుగా అం చనావేసుకుని అందుకుతగ్గట్లు వా రం రోజుల ముందే ఏర్పాట్లు పూర్ తి చేయాలన్నారు. శాఖలవారీగా అను మతులు పెండింగ్ లో ఉంటే వెంటనే అప్రోవల్ తీసుకుని పనులను వేగవం తం చేయాలన్నారు. అమ్మవారి గరుడ వాహన సేవ, గజ వాహన సేవ, పంచమి తీర్థం రోజున భక్తుల తాకిడి అధి కంగా ఉండే అవకాశం ఉందని, భక్తు ల రద్దీకి తగ్గట్లు అన్నప్రసాదా లు, క్యూ లైన్లు, సెక్యూరిటీ, పద్మసరోవరంకు ప్రవేశం, నిష్క్ రమణ, మెడికల్, పారిశుద్ధ్యం పను లు తదితర అంశాలపై ప్రత్యేక దృష్ టి పెట్టాలని సూచించారు. తిరు మలలో విద్యుద్దీపాలంకారాలు, ఫలపుష్ప ప్రదర్శన ఏవిధముగానై తే భక్తులను ఆకట్టుకున్నాయో అదే రీతిలో తిరుచానూరులో ఏర్పాటు చే యాలని ఇంజినీరింగ్ , గార్డెన్ విభాగాధికారులను ఆదేశించారు. తిరుపతి, తిరుచానూరు పరిసర ప్రాం తాలు పారిశుభ్రంగా ఉండేలా పంచా యతీ అధికారులను సమన్వయం చేసుకు ని చర్యలు చేపట్టాలని ఆరోగ్యశా ఖ అధికారులకు సూచించారు.
నవంబర్ 16 అంకురార్పణ నుండి పం చమి తీర్థం వరకు అధికారులు రాజీ పడకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నా రు. గత అనుభవాలను దృష్టిలో పె ట్టుకుని చలువ పందిళ్లు, రంగోళీ లు, పిఏ సిస్టమ్, ఎల్‌ఇడి తె రలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తు లను ఆకట్టుకునేలా హిందూ ధర్మప్ రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాబృం దాల ప్రదర్శనలు ఉండాలన్నారు . భక్తులకు సౌకర్యవంతంగా అన్నప్ రసాదాలు అందించేలా నవజీవన్, తో ళప్ప గార్డెన్స్, పూడీ, హైస్కూ ల్ ప్రాంతాలలో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పంచమి తీర్థం రోజున అలిపిరి నుండి తిరుచానూరు వరకు పడి ఊరేగింపులో భక్తులకు ముందస్తుగా సమాచారం తెలిసేలా ప్ రకటనలు ఇవ్వాలని, భక్తులకు తాగు నీరు, సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్య సేవలు తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృ ష్టి పెట్టాలని సూచించారు. అదేవిధంగా, పోలీసు, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమన్వ యం చేసుకుని భక్తులకు ఏర్పాట్ లు చేపట్టాలన్నారు. బ్రహ్మోత్ సవాలకు అవసరమైన శ్రీవారి సేవకు లను సమీకరించుకోవాలన్నారు. ఎస్ వీబీసీ ద్వారా బ్రహ్మోత్సవాలను ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసా రాలను అందించాలన్నారు. శాఖల వా రీగా జరుగుతున్న అభివృద్ధి పను లను సమీక్షించిన జేఈవో అధికారు లకు పలు సూచనలు చేశారు.
బ్రహ్మోత్సవాల వాహన సేవల వివరా లు.
- నవంబరు 11వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు
- 17-11-2025 (సోమవారం) ధ్వజారోహణం( ధనుర్ లగ్నం) చిన్నశేషవాహనం
- 18-11-2025(మంగళ వారం) పెద్దశే షవాహనం హంసవాహనం
- 19-11-2025(బుధవారం) ముత్యపుపందిరి వాహనం సింహవాహనం
- 20 -11-2025(గురువారం) కల్పవృక్ ష వాహనం హనుమంత వాహనం
- 21 -11-2025(శుక్ర వారం) పల్లకీ ఉత్సవం గజవాహనం
- 22-11-2025(శనివారం) సర్వభూపాలవాహనం సా. స్వర్ణరథం, గరుడవాహనం
- 23-11-2025(ఆదివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
- 24-11-2025(సోమవారం) రథోత్సవం అశ్వ వాహనం
- 25-11-2025(మంగళవారం) పంచమీతీర్థం ధ్వజావరోహణం.
- నవంబర్ 26న పుష్పయాగం.
ఈ కార్యక్రమంలో టిటిడి సీఈ శ్రీ టి.వి. సత్యనారాయణ, ఎఫ్ఎఅండ్ సీఏవో శ్రీ ఓ. బాలాజీ, తిరుచానూ రు ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీం ద్రనాథ్, ఐటి జీఎం శ్రీ డి. పణి కుమార్ నాయుడు పలువురు డిప్యూటీ ఈవోలు, అర్చకులు శ్రీ బాబు స్ వామి, పలువురు అధికారులు పాల్గొ న్నారు.


No comments :
Write comments