9.11.25

శ్రీ ప్ర‌స‌న్న‌ వెంక‌ట‌ర‌మ‌ణ స్వామివారి ఆల‌యంలో బాలాల‌యంకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌ punganur





చిత్తూరు జిల్లా పుంగ‌నూరులోని శ్రీ ప్ర‌స‌న్న‌ వెంక‌ట‌ర‌మ‌ణ స్వామివారి ఆల‌యంలో శ‌నివారం సాయంత్రం బాలాలయ సంప్రోక్షణకు  శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు.


ఇందులో భాగంగా సాయంత్రం 5 గంటలకు ఆల‌యంలో ఏర్పాటు చేసిన యాగశాలలో పుణ్యాహ‌వ‌చ‌నం, రుత్విక్‌వ‌ర‌ణం, వాస్తు పూజ‌, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించారు.

కాగా, న‌వంబ‌రు 9న ఉద‌యం 8 గంట‌లకు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, శాంతి హోమం, వాస్తు హోమం, కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని శ్రీ ప్ర‌స‌న్న‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి మూల‌మూర్తి శ‌క్తిని కుంభంలోకి ఆవాహ‌న చేసి యాగ‌శాల‌లో ప్ర‌తిష్టించి ఆరాధ‌న‌లు చేట్టారు. సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

న‌వంబ‌రు 10వ తేదీన‌ ఉద‌యం 7.30 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పూర్ణాహుతి, బాలాలయ సంప్రోక్షణ ఆగ‌మోక్తంగా నిర్వహించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఆగమ సలహాదారులు శ్రీ వి.శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ నాగేంద్ర, టెంపుల్ ఇన్స్పెక్టర్ లు శ్రీ భాను, రాహుల్, ఆలయ అర్చకులు, సిబ్బంది  పాల్గొన్నారు.

No comments :
Write comments