తిరుపతిలో టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబరు నెలలో జరుగనున్న ఉత్సవాల వివరాలిలా ఉన్నాయి.
- డిసెంబరు 4న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సవం.
- డిసెంబరు 4న శ్రీ తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర.
- డిసెంబరు 5న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
- డిసెంబరు 12, 19, 26వ తేదీల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు ఆలయ మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.
- డిసెంబరు 13న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామి వారు భక్తులను అనుగ్రహిస్తారు.
- డిసెంబరు 14న స్వామివారి తిరువడి సన్నిధి ఉత్సవం. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు ఉభయనాంచారులతో కూడిన శ్రీ గోవిందరాజస్వామివారిని ఎదురు ఆంజనేయస్వామివారి సన్నిధికి వేంచేపు చేస్తారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి అమ్మవార్లతోపాటు శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగిస్తారు.
- డిసెంబరు 19న శ్రీ తొండరడిపడి ఆళ్వార్ తిరునక్షత్రం.
- డిసెంబరు 23న శ్రవణా నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.
- డిసెంబరు 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
- డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి, డిసెంబరు 31వ తేదీ ముక్కోటి ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని ఉదయం 9.00 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
No comments :
Write comments