13.11.25

కార్తీక మ‌హాదీపోత్స‌వం ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన టిటిడి జేఈవో ttd jeo




తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నం ప్రాంగ‌ణంలోని ప‌రేడ్ మైదానంలో న‌వంబ‌రు 14వ తేదీ టీటీడీ నిర్వ‌హించ‌నున్న కార్తీక మ‌హాదీపోత్స‌వం ఏర్పాట్ల‌ను జేఈవో శ్రీ వి. వీర‌బ్ర‌హ్మం బుధ‌వారం సాయంత్రం అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.


ఈ సంద‌ర్భంగా జేఈవో మాట్లాడుతూ, తిరుపతిలో నిర్వ‌హించే దీపోత్స‌వానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఎస్వీబీసీ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రత్యక్ష ప్రసారం  చేస్తుంద‌న్నారు. సాయంత్రం 5.30 గంటలకు వేద స్వస్తితో దీపోత్స‌వం ప్రారంభమవుతుంద‌ని,  అనంతరం దీప ప్రశస్తి, విష్వ‌క్సేన పూజ, పుణ్యాహవచనం, విష్ణుసహస్రనామ పారాయ‌ణం, మహాలక్ష్మీ పూజ, దీప లక్ష్మి నృత్య‌రూప‌కం, గోవిందనామాలు, చివ‌ర‌గా కుంభ హారతితో రాత్రి 8.30 గంటలకు ముగుస్తుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మం సజావుగా జ‌రిగేలా అన్ని విభాగాల‌తో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిపిపి కార్య‌ద‌ర్శి శ్రీ శ్రీరామ్ ర‌ఘునాథ్, ఎస్వీబీసీ సీఈవో శ్రీ డి.ఫ‌ణికుమార్ నాయుడు, ఎస్‌ఇ శ్రీ మ‌నోహ‌రం, విజివో శ్రీ గిరిధ‌ర్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు డాక్టర్ ల‌త త‌దిత‌రులు పాల్గొన్నారు.

No comments :
Write comments