దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమలలో డిసెంబర్ 21వ తేదీ పల్స్ పోలియో కార్యక్రమం జరుగనుంది.
ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం డిసెంబర్ 21న ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అశ్విని ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, జీఎన్సీ టోల్ గేట్, సిఆర్ఓ, పీఏసీ 1 మరియు 2, కొత్త బస్టాండ్, హెల్త్ ఆఫీస్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 మరియు 2, ఏటీసీ, ఎంబీసీ-34, వరాహస్వామి విశ్రాంతి గృహం 1, రాంభగీచా రెస్ట్ హౌస్ 1, కల్యాణకట్ట, మేదరమిట్ట, పాపవినాశనం, సుపథం, బాలాజీ నగర్ వినాయక ఆలయం, బాలాజీ నగర్ బాలబడి, ఎస్వీ హై స్కూల్, తిరుమల ఆలయం లోపల మరియు వెలుపల, ఉద్యోగుల డిస్పెన్సరీల వద్ద పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేస్తారు.
ఇందులో భాగంగా 20వ తేది ఉదయం 10 గంటలకు ఎస్వీ హైస్కూల్ నుంచి బాలాజీ నగర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి యాత్రికులు మరియు స్థానికుల కొరకు జీపులో ప్రకటనలు చేస్తూ అవగాహన కలిగించనున్నారు.
No comments :
Write comments