20.12.25

డిసెంబర్ 23న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం koil alwar tirumanjanam




తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8 తేదీ వరకు పది రోజుల వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలను పుర‌స్క‌రించుకుని డిసెంబర్ 23 తేది మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది.


సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీఉగాదిఆణివార ఆస్థానంబ్రహ్మోత్సవంవైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.


డిసెంబర్ 23 తేది ఉదయం 6 నుండి 10 గంటల వరకు  ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు కారణంగా అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేయడం జరిగింది.


అదేవిధంగా 23 ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో 22 తేది సిఫార్సు లేఖలు స్వీకరించబడవు విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.

No comments :
Write comments