తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబరు 4న కార్తీక దీపోత్సవం ఘనంగా జరుగనుంది. సాయంత్రం శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుండి కార్తీక దీపం, వస్త్రాలను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ గోవిందరాజస్వామివారికి సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆలయం, ఉపాలయాల్లో కార్తీక దీపం వెలిగించనున్నారు.
శ్రీ కోదండరామాలయంలో
తిరుపతి శ్రీ కోదండరామాలయంలో డిసెంబరు 4న సాయంత్రం కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుండి ఆలయ మర్యాదలతో పడి, కార్తీకదీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయానికి తీసుకువచ్చి, కార్తీక దీపాలను వెలిగిస్తారు.
No comments :
Write comments