టిటిడి ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ నిధులు, సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ రేణుకామాత ఆలయాన్ని టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు బుధవారం తిరుపతి సమీపంలోని రామచంద్రాపురం మండలం లక్ష్మీపురం గ్రామంలో సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ, గ్రామంలో ప్రతిరోజూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమరసత సేవా ఫౌండేషన్‌ను ఆయన అభినందించారు. దూర గ్రామాల్లోనూ ప్రజలు సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ, నిత్య ఆధ్యాత్మిక–సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందకరమన్నారు.
ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక అవగాహనను పెంచడంతో పాటు సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యనిర్వాహకులు శ్రీ భారత్, శ్రీ ఆదిత్య, సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ విష్ణు, జోనల్ కన్వీనర్ శ్రీ రెడ్డెప్పరావు పాల్గొన్నారు.
వారు గ్రామస్తులతో మమేకమై ఆలయ ప్రాముఖ్యతను, సేవా కార్యక్రమాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments