24.12.25

నవ‌ వధువరులకు శ్రీ‌వారి అక్షింత‌లు srivari akshintalu




నూత‌నంగా వివాహం చేసుకునే పెళ్లి కుమారైపెళ్లి కుమారుడికి శ్రీ‌వారి దీవెనలతో అక్షింతలుకుంకుమకంకణంశ్రీవేంకటేశ్వర‌స్వామిశ్రీపద్మావతీ అమ్మ‌వారి ఫోటోలతో కూడిన ఆశీర్వచనం పత్రిక, 'కల్యాణ సంస్కృతిపుస్తకం టీటీడీ అందిస్తోందిప్ర‌తి ఏడాది శుభ‌లేఖ పంపిన‌ ల‌క్ష‌కు పైగా వ‌ధువ‌రుల‌కు శ్రీ‌వారి దీవెనలతో క‌ల్యాణం జ‌రుగుతోంది.      


నూతన వధువరులు కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారుఇంతటి విశిష్టమైన వివాహానికి కలియుగ వైకుంఠం శ్రీవేంకటేశ్వరుని ఆశీస్సులు అందితే అంతకన్నా కావాల్సిందేముంది మహత్తర అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పిస్తోందిఇందుకు చేయాల్సింది పూర్తి చిరునామాతో వివాహ శుభలేఖను పంపాలి.


నవసమాజంలో గృహస్థ ధర్మం కీలకమైనదివధువరుల కల్యాణంలో మొదటి ఘట్టంగా కంకణధారణ చేస్తారుఉపద్రవాల నుండి రక్షించే రక్షాబంధనమైన కంకణాలను వరుడి కుడిచేతికివధువు ఎడమ చేతికి ధరింపచేస్తారుఇందుకోసం శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో సకల శుభాలు కోరుతూ కుంకుమకంకణధారణకు కంకణం పంపుతారు.


వివాహంలో భాగంగా చివరిగా తలంబ్రాలు పోసే ఆచారం ఉందినవ దంపతులకు సకల మంగళాలు కలగాలనిసత్కర్మలు పెంపొందాలనిదాంపత్యం ఫలప్రదం కావాలనిభార్యాభర్తలు పరస్పరం ప్రీతిపాత్రులు కావాలనిసిరిసంపదలు కలగాలని టిటిడి కోరుతూ శ్రీవారి ఆశీస్సులతో తలంబ్రాలు పంపుతోంది.


నూతన వధువరులకు వివాహ వ్యవస్థ గురించి తెలిపేందుకు  ''కల్యాణ సంస్కృతి'' పేరిట  పుస్తకాన్నిశ్రీవేంకటేశ్వరుడుశ్రీ పద్మావతీల ఫోటోలతో కూడీన వేద ఆశీర్వచన పత్రికను టిటిడి కార్యనిర్వహణాధికారి పేరిట పంపుతారు.


తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల శుద్ధ ప్రతి విభాగం (తపాలా విభాగంసిబ్బంది నిరంతరం శ్రమిస్తూ ప్రతి సంవత్సరం ల‌క్ష‌కు పైగా నూతన జంటలకు శ్రీవారి అశీస్సులు అందిస్తున్నారు.


శ్రీవారి ఆశీస్సులు ఎలా పొందాలి :


శ్రీవారి ఆశీస్సులు పొందగోరు నూతన వధూవరులు త‌మ పూర్తి చిరునామాతో ''కార్యనిర్వహణాధికారిటిటిడి పరిపాలన భవనంకె.టి.రోడ్డుతిరుపతి - 517501'' పేరిట వివాహ పత్రికను పంపాలిమరిన్ని వివరాలకు కాల్ సెంటర్ నెం.155257 సంప్రదించగలరు.


No comments :
Write comments